Actor Sidharth | Actress Pranita | Bava | సిద్దార్థ్ "బావ"లో మరదలిగా ప్రణీత
WD
దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... ఈ చిత్రంలో మరదలి పాత్రకోసం చాలామందిని అనుకుని, చివరకు బెంగళూరు అమ్మాయి ప్రణీతను ఎంపిక చేశాం. అందమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ప్రతి ఫ్రేమూ ఓ పెయింటింగ్‌లా ఉంటుంది అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ... రెండో షెడ్యూలు ఈ నెల 15 నుంచి రాజోలు, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో జరుగుతుంది. ఏప్రిల్ 2 వరకూ జరుగుతుంది. సిద్దార్థ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రణీత, పవిత్రా లోకేశ్, రఘు బాబు, జోగి నాయుడు, ప్రభాస్ శ్రీను, వేణు తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఏప్రిల్ 15 నుంచి హైదరాబాదులో మూడో షెడ్యూలు జరుగుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: చక్రి, కెమేరా: అరవింద్ కృష్ణ, ఎడిటింగ్: గౌతం రాజు, సమర్పణ: సందీప్