1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. L.B. Sriram

OM SaiRam | L.B. Sriram | Kota Srinivasa Rao | Shirdi Sai | తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న "ఓం సాయిరాం"

ఓం సాయిరాం
WD
షిర్డిసాయి భక్తుల యధార్థ అనుభవాల నేపథ్యంలో శ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ నిర్మిస్తున్న "ఓం సాయిరాం" సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం కోట శ్రీనివాసరావు, రావురమేష్, నూతన్ ప్రసాద్, అశోక్‌కుమార్, రాజ్యలక్ష్మి, సుదీప్ తదితరులపై కీలక సన్నివేశాలను పలు లొకేషన్స్‌లో చిత్రీకరించారు.

దర్శకుడు, నిర్మాత శ్రీనివాస్ జి.ఎల్.బి పాత్రపై ఉన్న అభిమానంతో కోట శ్రీనివాసరావు అర్థరాత్రి వరకు షూటింగ్‌లో పాల్గొని ఎంతగానో సహకరించారని చెప్పారు. షిర్డీసాయి భక్తుల అనుభవాలతో తయారుచేసుకున్న కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. తనకు కలలో కనిపించి ఈ సినిమాను తీయాల్సిందిగా బాబా ఆదేశించారు.

సీనియర్ ఆర్టిస్టులు పలువు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ తొలివారంలో ప్రారంభమవుతుందని చెప్పారు.

బాబా సందేశాన్ని అందుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు సహ నిర్మాత కొత్తూరు శత్రుఘ్నుడు చెప్పారు. ఈ చిత్రం బాబా భక్తులనే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉంటుందని వెల్లడించారు.

ఈ చిత్రంలో కోట, ఎల్.బి.శ్రీరామ్, నాజర్, నూతన్‌ప్రసాద్, రావురమేష్, జాకీషరాఫ్, అశోక్‌కుమార్, శ్రీనివాసవర్మ, సుధ, రాజ్యలక్ష్మి, సుదీప, అల్లరి సుభాషిణి, సౌమ్య, వాసన్, రవికిరణ్, పురుషోత్తంరావ్, ఈశ్వర్ విజయ్‌వర్మ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికిరణ్, సహ నిర్మాత: గంటా సుజాతరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: శ్రీనివాస్ జీఎల్‌బీ.
About Writer
SELVI.M