1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dasari Narayana Rao

Young India | Dasari Narayana Rao | Hero | Heroines | Keeravani | వారిని ఆ లుక్‌తో చూస్తేనే బాగుంటుంది: దాసరి నారాయణ

యంగ్ ఇండియా
FILE
తన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "యంగ్ ఇండియా" చిత్రంలోని 81 మంది కొత్త హీరోహీరోయిన్లను చూడాలంటే రిలీజ్‌రోజు వరకు వేచి చూడాల్సిందేనని డాక్టర్. దాసరి నారాయణరావు అన్నారు. తెరపైన వారిని ఆ లుక్‌తో చూస్తేనే బాగుంటుందని దాసరి చెప్పారు.

తాను యంగ్ ఇండియా ద్వారా పరిచయం చేస్తున్న కొత్త హీరోహీరోయిన్లు తెరపై వారి పాత్రల ద్వారా పరిచయం అవడమే బాగుంటుందని దాసరి వెల్లడించారు. ఇలా చూపిస్తేనే బాగుంటుందనే తన ఐడియాను.. కొంతమంది ముందుగా కాపీచేసేసి వారి సినిమాల్లో గోప్యంగా ఉంచుతున్నారని దాసరి చెప్పారు.

కీరవాణి గురించి చెబుతూ.. కీరవాణి తన ఆశీస్సులతోనే సినిమారంగంలో ప్రవేశించాడు. ఆయనను తానే మొదటి అవకాశాన్ని కల్పించాను. కానీ ఆ సినిమాను పూర్తిచేయలేకపోయాను. తిరిగి అదే అవకాశాన్ని కీరవాణికి 201 చిత్రంగా "యంగ్ ఇండియా"లో కల్పించానని దాసరి తెలిపారు.

మంచి ఆడియోను ఇచ్చిన కీరవాణిని ఈ నెల పదోతేదీన ఆడియో విడుదల కార్యక్రమంలో సత్కరించనున్నట్లు చెప్పారు. రవీంద్ర భారతిలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు దాసరి వెల్లడించారు.

అందరికీ అందుబాటులో ఉండేట్లుగా 9.99 పైసలకే ఆడియోను విక్రయిస్తున్నట్లు చెప్పారు. సినిమా గురించి చెబుతూ.. అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ నెల 30 యంగ్ ఇండియాను విడుదల చేస్తామని తెలిపారు.
About Writer
SELVI.M