NTR | Pranathi | Betrothal | Hari Krishna | Marriage | May 9 | మే 9న ఎన్టీఆర్- ప్రణతిల వివాహం: నారా రామ్మూర్తి
FILE
స్వర్గీయ గుమ్మడి ఇంటి పక్క ఇళ్లే నార్నే వారిది. బుధవారం ఉదయం నుంచే ఆ ఇంటికి డెకరేషన్ చేశారు. గురువారం పలు మీడియావారు లైవ్‌షోలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ఇంటికి వచ్చే కార్లను నేరుగా లోపలికి పోనిచ్చిన తర్వాత గేట్లు మూసుకుపోతాయి. లోపల అతిథులను దింపిన తర్వాత కారుడ్రైవర్లు కార్లు తీసుకుని బయటకు వస్తారు.
పలు ఎలక్ట్రానికి మీడియాలు కారు డ్రైవర్లతో మాట్లాడాలని ప్రయత్నించినా ఫలించలేదు. తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంలో 4 నుంచి 4.30 గంటల మధ్యలోనే ఎన్టీఆర్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. నారా కుటుంబం, నందమూరి కుటుంబం మినహా ఎవరినీ పిలిపించలేదు. నిశ్చితార్థం ఫోటోలు మాత్రం తామే రాత్రి మీడియాకు విడుదల చేస్తామని నార్నే కుటుంబం వెల్లడించింది.