1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Hasini | Cinema | Audio | Y.S. Jagan | Sandhya | Kamalakar Reddy | వై.ఎస్. జగన్ చేతులమీదుగా "హాసిని" ఆడియో విడుదల

హాసిని
FILE
కమలాకర్‌రెడ్డి హీరోగా బి.వి. రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన "హాసిని" చిత్రం ఆడియో హైటెక్ సిటీలోని రాక్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వై.ఎస్. జగన్ ఆడియో సీడీని ఆవిష్కరించిన నితిన్‌కు అందించారు. ఆడియో క్యాసెట్‌ను హీరో శ్రీహరి విడుదల చేసి రమేష్ ప్రసాద్‌కు అందజేశారు.

ఆడియో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నేను పాల్గొన్న మొట్టమొదటి సినిమా కార్యక్రం ఇదే. హీరో సోదరుడు శివప్రసాద్ రెడ్డి ఆహ్వానిస్తే రావడం జరిగింది. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. హాసిని చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

చిత్ర సమర్పకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. "గతంలో "అభి" అనే సినిమా నిర్మించాం. వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే పాయింట్‌తో తీశాం. ప్రస్తుతం తీస్తున్న హాసిని సినిమా కూడా అలాంటిదే. కోటి చక్కటి సంగీంతం అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని చెప్పారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "సుబ్బారెడ్డి చాలా సింపుల్‌గా కన్పించినా కుమారుల్ని వేర్వేరు రంగాల్లో ప్రవేశం చేయించారు. దర్శకుడు రమణారెడ్డి కూడా నటుడే. గతంలో ప్రేమపంజరం సినిమాను ఆయన రూపొందించాడు. రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అని ఆశించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి.వి. రమణారెడ్డి, శివప్రసాద్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. హాసిని చిత్రం విజయవంతం కావాలని అభిలాషించారు.
About Writer
SELVI.M