1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Coat

Jr NTR | Coat | Hat | Auction | లక్షలు పలికిన జూనియర్ ఎన్టీఆర్ కోటు, హ్యాటూ

జూనియర్ ఎన్టీఆర్
WD
"అదుర్స్" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించిన కోటు, టోపీని వేలం వేయగా లక్షల రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పేద కళాకారుల సహాయార్థం ఉపయోగిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఫిలిమ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... నా అభిమానులు ఇటువంటి మంచి పనికోసం ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. "మా" అసోసియేషన్‌కు ఎటువంటి అవసరమున్నా నేను ముందుంటాను. "మా" వెబ్‌సైట్ ఈ వేలంపాటను వేసింది.

ఎంత వచ్చింది అనేది బయటపెట్టం. బయటపెడితే ఫ్యాన్స్ మధ్య లేనిపోని గొడవలు వస్తాయి. మొట్టమొదటిసారిగా వేలంపాటను వేసిన వస్తువుల ద్వారా పేదవారికి సాయపడటం మరింత ఆనందాన్నిచ్చింది అన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT