1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ori Devuda Kalam marela

Telangana Movie | Ori Devuda Kalam marela | తెలంగాణపై "ఓరి దేవుడా..! కాలం మారెలా..!" చిత్రం ప్రారంభం!

ఓరి దేవుడా కాలం మారెలా తెలంగాణ రాదెలా
FILE
న్యూవే క్రియేషన్స్ అనే బేనర్‌పై తెలంగాణా నేపథ్యంలో అంతా తెలంగాణావారితో "ఓరి దేవుడా! కాలం మారెలా!" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పాటల రికార్డింగ్ ప్రారంభించారు. అందరూ కొత్తవారితో "ఓరి దేవుడా! కాలం మారెలా!" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు రవి ములకలపల్లి తెలియజేస్తున్నారు.

శనివారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. దీనికి తెలంగాణాకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దపాకరరమేష్ మాట్లాడుతూ.. ఇది ఫక్తు తెలంగాణా సినిమా అని, ఇందులో అందరూ తెలంగాణా జిల్లాల్లోని ఆర్టిస్టులకూ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుత కాలానికి అనుకూలంగా యువత మనోభావోద్వేగాలు, వారి జీవనసరళిని ఇందులో చూపిస్తామన్నారు. సరదాగా, కామెడీగా యూత్‌ఫుల్ ఎమోషనల్స్‌తో యువతకి నచ్చే విధంగా ఈ చిత్రాన్ని తీస్తామని చిత్ర నిర్మాత చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం : గోరంట్ల కృష్ణ, కెమెరా : ఆర్సన్.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అల్లర్ల నేపథ్యంలో హడావుడిగా ఇప్పటివరకు నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నట్లు పలువు ముందుకు వచ్చారు. అయితే ఇంతవరకు ఏదీ మొదలుకాలేదు. ఏదో ఆవేశంతో వచ్చినట్లుగా ఉందని, సరైన ప్రణాళిక లేదని ఈ చిత్రం రికార్డింగ్ సందర్భంగా పలువురు అనుకోవడం కొసమెరుపు.