1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Akash

Ayuda poratam | Akash | Sai Kiran | Athid Srinivas | Preity Minal | Anita Reddy | ఆకాష్ "ఆయుధ పోరాటం" షూటింగ్ పూర్తి

ఆయుధ పోరాటం
ఆకాష్, సాయికిరణ్, అతిథ్ శ్రీనివాస్, ప్రీతి మినాల్, అనితారెడ్డి ప్రధాన తారాగణంగా "ఆయుధ పోరాటం" అనే చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 

ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ.. "దేశంలో ఏడు రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కటి కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి ఒక సమస్యను పరిష్కరిస్తారు. అది ఏమిటి? అనేది సినిమా. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేయనున్నాం" అని అన్నారు.

సాయికిరణ్ మాట్లాడుతూ.. రామ్‌దేవ్‌ చిత్రంలో ఆకాష్‌తో కలిసి నటించాను. దర్శకుడి టాలెంట్ అతనిలో ఉంది. కథ సమాజంలో కాంట్రవర్సల్ పాయింట్" అని తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం : నందన్‌రాజ్, శ్యామ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : ఆకాష్, నిర్మాణం : జై బాలాజీ మూవీ మేకర్స్, అలిపిరి మూవీ ప్రొడక్షన్స్.