Ram Gopal Varma | God and Sex | Swami Nityanand | రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రం "గాడ్ అండ్ సెక్స్"
త్వరలో ఇండియన్ స్క్రీన్స్‌పైకి "రక్త చరిత్ర" రానుంది. ఈ చిత్రం దాదాపు పూర్తయిపోయింది. ఆ తర్వాత ఎటువంటి సినిమా తీయాలా...? అని ఆలోచించిన రామ్ గోపాల్ వర్మకు చటుక్కున ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక గురువుల్లో చాలామంది సెక్స్ ఆరోపణలలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు.
ఇహపర సుఖాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాగరాన్ని ఆవిష్కరించాల్సిన గురువులు "సెక్స్.. సెక్స్... సెక్స్.." అంటూ దానివైపు అర్రులు చాస్తూ పరుగెడుతున్నారు. దేశంలోని ప్రముఖ బాబాలలో చాలామంది సెక్స్ ఆరోపణలు ఎదుర్కొనడం నేడు మామూలై పోయింది. ఈ నేపధ్యంలో వీరి గాధలను ఆధారం చేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందీ...? అని ఆలోచించిన రామ్ గోపాల్ వర్మ వెంటనే "గాడ్ అండ్ సెక్స్" అనే చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రంపై వర్మ ఓ వార్తా పత్రికతో మాట్లాడుతూ... "గాడ్ అండ్ సెక్స్" సినిమా తీస్తున్నది నిజమేనన్నారు. గాడ్ అండ్ సెక్స్ అనేది తాజాగా ఆధ్యాత్మిక గురువులు - సెక్స్ అనే అంశంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఐతే నిత్యానంద అంశాన్ని మక్కీకి మక్కీగా మాత్రం తీయనని చెప్పారు.
