Tollywood | Cinema | Chiranjeevi | Dasari Natayana Rao | కొత్తవారివల్లే ఇండస్ట్రీకి దరిద్రం పట్టుకుంటోంది: తమ్మారెడ్డి
సినీ పరిశ్రమ నలుగురు వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయి ఉందనీ, దానిని వారి చేతుల నుంచి విముక్తం చేయాల్సిన అవసరం ఉందని దర్శకుడు దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. పనిలోపనిగా మంచి కథ లేకపోతే రాజశేఖర్, చిరంజీవి లాంటి హీరోలు సినిమాలైనా బాక్సాఫీసుల వద్ద తుస్సుమంటాయన్నారు.
సినిమా సక్సెస్ సంగతి ప్రక్కనపెడితే... అసలు సినిమా నలుగురు వ్యక్తుల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఆయన మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదనలు బయలుదేరాయి.
అయితే అటువంటిదేమీ లేదనీ, సినీ పరిశ్రమలో తామంతా కలిసి ఉంటామని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న నారాయణరావు ఎవరినైనా సందర్భాన్ని బట్టి చురకలు వేయడం సహజమేననీ, దీనిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదని అన్నారు.
ఇక సినిమా పరిశ్రమ నలుగురు చేతుల్లో ఉందన్న వ్యాఖ్యలపై భరద్వాజ స్పందిస్తూ... సినిమా తీస్తే వచ్చే లాభ నష్టాల గురించి తెలియని వారు ఇండస్ట్రీకి వస్తున్నారన్నారు. వారివల్లే సినిమా ఇండస్ట్రీకి దరిద్రం పట్టుకుంటోందని వ్యాఖ్యానించారు.