Marocharitra | Dil Raju | Anita | Varun Sandesh | "మరోచరిత్ర" తిరగబడేసరికి నింద నాపై: అనిత
మరోచరిత్రను ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మించారు. ఆ చిత్రానికి రవియాదవ్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇటీవలే ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా సినిమాలో హీరోయిన్‌గా అనితను తీసుకోవడం రాంగ్ సెలక్షన్. వీసా ప్రాబ్లమ్ వల్ల వేరే అమ్మాయికి బదులు ఈమెను సెలక్ట్ చేశామని, ఇది తప్పిదమేనని అన్నారు.
రాజు మాట్లాడేటపుడు స్టేజీపై అనిత కూడా ఉంది. అయితే ఆమెకు తెలుగు సరిగ్గా తెలియదు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది. సినిమా విడుదలకు ముందు కథాపరంగా ఎన్నారై హీరోహీరోయిన్లు కావాల్సివచ్చిందనీ, అందుకే తనను సెలెక్ట్ చేశారని చెప్పడమే కాక ఈ సినిమాలో తనకు మంచి పేరు వస్తుందని కూడా అన్నారు.
అలాంటిది సినిమా ఫట్ అయ్యేసరికి రూటుమార్చి ఆ నిందలు తనపై వేస్తున్నాడని ధ్వజమెత్తింది. ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు కూడా ఉంటారా....? అని ఆశ్చర్యపోయానని అంది. ప్రస్తుతం తాను ఇంకా ఏ చిత్రానికి కమిట్ కాలేదనీ, ఫ్యామిలీ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయనీ, అవి అయ్యాక తెలుగు సినిమాలపై శ్రద్ధ పెడతానని అంది.
