1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Eetaram Films

Em pilloo Em pilladoo | Eetaram Films | Pranitha | ఈతరం ఫిలిమ్స్ "ఏం పిల్లో.. ఏం పిల్లడో"

ఏం పిల్లో ఏం పిల్లడో
ఈతరం ఫిలిమ్స్ పతాకంపై తనీష్ హీరోగా, బెంగళూరుకు చెందిన ప్రణీత హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రానికి "ఏం పిల్లో... ఏం పిల్లడో" పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత పోకూరి బాబూరావు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా బ్యానర్లో ఇది 15వ సినిమా. ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతుంది. ఈ చిత్రంలో ఉండాల్సిన ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. జనవరి 1న షూటింగ్ ప్రారంభించాం. దాదాపు పూర్తయింది. మూడు పాటలు పూర్తి చేస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ... ఇది నాకు మాతృ సంస్థ. నన్ను పోకూరి బాబూరావు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. రెండవ సినిమాలోనూ నాకు అవకాశం కల్పించారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ప్రతీ టెక్నీషియన్ బాగా పని చేశారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుందని అన్నారు.

తనీష్, ప్రణీత మాట్లాడుతూ.. తమతో ప్రతి సన్నివేశాన్ని బాగా రక్తికట్టేలా వచ్చేవరకూ దర్శకనిర్మాతలు కృషి చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, చరణ్ రాజ్, రవిశంకర్, రమాప్రభ, ప్రగతి, స్వాతి తదితరులు నటిస్తున్నారు. కథ: ఈతరం యూనిట్, సమర్పణ: పోకూరి రామారావు, నిర్మాత: పోకూరి బాబూరావు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT