Hero | Srikanth | Ranga the Donga | Shooting | Bike | Accident | Nanakramguda | Filmnagar | Apolla Hospital | KVR hospital | "రంగా ది దొంగా" షూటింగ్‌లో గాయపడ్డ హీరో శ్రీకాంత్
FILE
గాయాలపాలైన హీరో శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ఫిల్మ్ నగర్‌లోని కేవీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలావుండగా ప్రమాదం జరిగిన వెంటనే శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించడంతో సహ నటీనటులు తదితర సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్ళారు. ఈ సందర్భంగా సహనటుడు శివాజీ రాజా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందని, అభిమానులు భయపడాల్సిన పనిలేదని ఆయన తెలిపారు.
కాగా శ్రీకాంత్ కాళ్ళకు, చేతులకు గాయాలవ్వడంతో అపోలో ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను కేవీఆర్ ఆసుపత్రికి పిలిపించి వారి పర్యవేక్షణలో చికిత్సను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.