1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sabita Indra Reddy

Cine Directors | Sabita Indra Reddy | Cinema | సబిత గారూ... ఊపిరి పోయండి: చిన్న చిత్రాల దర్శకులు

సినీ దర్శకులు
WD
కనుమరుగవుతున్న చిన్న చిత్రాలకు ఊపిరి పోయాలని చిన్న చిత్రాల దర్శకులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. చిన్న చిత్రాల నిర్మాణం గణనీయంగా తగ్గిపోవడంతో వందలమంది కార్మికులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రికి విన్నవించారు.

అంతకుముందు తాము రూపొందించిన ఎజెండాను సినిమాటోగ్రఫీ మంత్రి డాక్టర్ గీతారెడ్డిగారిని, పంచాయతిరాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణగారిని ఎఫ్.డి.సి ఎం.డి పార్థసారథిగారికి అందించారు. మళ్లీ శనివారంనాడు చిన్న చిత్రాల పునరుద్ధరణకు ప్రభుత్వం వేసిన కమిటీలో ముఖ్య సభ్యురాలైన శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిగారిని వారి స్వగృహంలో ఉదయం 10 గంటలకు కలిశారు.

దాదాపు గంటసేపు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చించారు. ఆ తర్వాత శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ఎజెండాలో రూపొందించిన పరిష్కార మార్గాలు అనుసరిస్తే చిన్ని చిత్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు సమసిపోతాయని దర్శకులతో ఏకీభవించడమే కాక సినీ కార్మికులకు ఉపయోగకరమైన ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా మంత్రిగా నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తి కలుగుతుంది అంటూ సానుకూలంగా స్పందించారు.

త్వరలో జరుగబోయే కమిటీ మీటింగ్‌లో తప్పనిసరిగా చిన్న చిత్రాలకు ఊపిరి పోసే దిశలో కమిటీ నిర్మాణాత్మక నిర్ణయాలు అనుసరిస్తుందని అన్నారు. హోంమంత్రిన కలిసిన దర్శకులలో త్రిపురనేని చిట్టి, శివనాగేశ్వరరావు, వీరశంకర్, దేవీప్రసాద్, వెంకీ, మద్దినేని రమేష్, బి.జయ ఉన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT