1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Bhanushree

Allu Arjun | Bhanushree | Varudu | బన్నీ... భానుశ్రీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడేమో..?!!

అల్లు అర్జున్
WD
బన్నీ అని నిక్ నేమ్‌తో పిలువబడే అల్లు అర్జున్ తన తాజా చిత్రం "వరుడు" గురించి మాట్లాడారు. అందులో హీరోయిన్‌ సొమ్మసిల్లి పడిపోతే సెలైన్ ఎక్కిస్తారు. అటువంటి ఆమెను హీరో పాత్రధారి సందీప్ భుజాలపై ఎక్కించుకుని కొండలు, వాగులు, రోడ్ల వెంట పరుగెడుతుంటాడు.

ఇది నిజ జీవితంలో సమంజసమేనా..? మీరయితే అలా చేస్తారా..? అని అడిగితే.. బన్నీకి అలా చేసే ధైర్యం లేదు. సందీప్ అయితే చేస్తాడు. అతనికి ధైర్యమున్నదంటూ అల్లు అర్జున్ తన మనసులో మాటను తెలిపారు. అంటే సినిమా సినిమానే... జీవితం జీవితమే... పెండ్లి గురించికూడా ప్రస్తావించగా.. నేను ముందుగా చెప్పేది మీడియాకేనంటూ.. ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు.

ఇదిలావుండగా వరుడు సినిమా తర్వాత తనను చాలామంది పెండ్లి ఫంక్షన్లను పిలుస్తున్నారనీ, 8వ తేదీ నా పుట్టిన రోజైనప్పటికీ చాలాచోట్ల పెండ్లిళ్లకు హాజరయ్యాననీ ఆనందంగా చెప్పారు. కానీ ఎక్కడా తనకు నచ్చిన అమ్మాయి దొరకలేదనీ, అంటూ "వధువు"లాంటి అమ్మాయి దొరకాలి కదా..! అంటూ పక్కనే ఉన్న భానుశ్రీమెహ్రా తొడపై చేయివేసి మరీ చెప్పాడు. మరి భానుశ్రీ ఒప్పుకుంటే చేసుకుంటాడేమో... అని సందేహం అక్కడివారికి కలిగింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT