1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Varudu

Actress Bhanu Mehra | Varudu | Kiss | Allu Arjun | "కిస్" ఇవ్వడాన్ని మా పెద్దలు తప్పనలేదు: భాను మెహ్రా

భాను మెహ్రా
WD
తొలి చిత్రంలో తన ఫోటోను చూపించకుండా పబ్లిసిటీ చేసిన గుణశేఖర్, అల్లు అర్జున్‌ను "వరుడు" హీరోయిన్ భానుమెహ్రా అభినందించింది. తాను అమృత్‌సర్ అమ్మాయినని చెపుతూ... ముంబయిలో టాటా ఇండికామ్, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చేశానని అంది.

తన ఎత్తు 5 అడుగుల ఆరంగుళాలని చెప్పింది. తనకిష్టమైన నటి కరీనాకపూర్ అని అంది. భవిష్యత్‌లో ఎక్స్‌పోజింగ్ చేస్తారా... అని అడిగిన ప్రశ్నకు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత తనే తమాయించుకుని.. అలాంటి వాటిని అస్సలు చేయనని, వరుడు లాంటి పాత్రలు, మంచి పెర్‌ఫార్మెన్స్ ఉన్నవి చేస్తానని చెప్పింది.

మరి వరుడులో కిస్సింగ్ సీన్ చాలాసేపు ఉంది కదా.. అది తప్పనిపించలేదా...? అని అడిగితే... కథ ప్రకారమే అలా కిస్ చేశాననీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఈ సీన్ తప్పుగా అనిపించలేదని కితాబిచ్చారని చెప్పింది. మరి భవిష్యత్‌లో బికినీ వేస్తే... అప్పుడు కూడా కథ డిమాండ్ మేరకే అని చెబుతుందేమో.. అప్పుడు ఆ కోపం చల్లారిపోతుందేమో.. చూద్దాం!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT