Simha | Actor Balakrishna | Nayanatara | Sneha Ullal | Namita | ఏప్రిల్ 16న "సింహా" ఆడియో విజయోత్సవం
WD
ఈ ఆడియో విజయోత్సవ వివరాలను నిర్మాత పరుచూరి కిరీటి తెలియజేస్తూ.. చక్రి సంగీత సారధ్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలైన సింహా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఆడియో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న హైదరాబాదులోని రాక్ గార్డెన్స్‌లో సాయంత్రం 6 గంటలకు ఆడియో విజయోత్సవాన్ని జరుపనున్నారు.
ఈ ఫంక్షన్‌కి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుగారు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. యువరత్న బాలకృష్ణతోపాటు చిత్రంలోని నటీనటులు, ఇతర టెక్నీషియన్లందరూ పాల్గొంటారు.
ఈ చిత్రంలో యువరత్న బాలకృష్ణ సరసన నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్యా మీనన్, కె.ఆర్. విజయ, బ్రహ్మానందం, వేణు మాధవ్, అలీ, ధర్మవరపు తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. మహేంద్రబాబు, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ-స్క్రీన్ ప్లే- మాటలు - దర్శకత్వం: బోయపాటి శ్రీను