1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Komuram Puli

Pavan Kalyan | Komuram Puli | Songs | Film | ఏప్రిల్ 18 నుంచి స్టెప్పులేయనున్న "కొమురం పులి"

పవన్ కల్యాణ్
WD
పవన్ కల్యాణ్, నిఖిషా పటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం కొమురం పులి. ఎస్.జె.సూర్య దర్శకుడు. సింగమల రమేష్ నిర్మాత.

షూటింగ్ టాకీ పూర్తయింది. ఈనెల 18 నుంచి పాటల చిత్రీకరణ జరుగనున్నది. హైదరాబాదులో వేసిన రకరకాల సెట్లో వీటిని తెరకెక్కించనున్నారు.

మరోవైపు డబ్బంగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ పాత్ర విషయంలో భిన్న షేడ్స్ ఉన్న దృష్ట్యా డబ్బింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు దర్శకుడు చెపుతున్నారు.

ఎ.ఆర్. రెహమాన్ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. మే 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT