Ram Gopal Varma | 3D horror film | Director | తలుపు వెనక నిలబడి "భూ...." అనేవాడిని: వర్మ
WD
"భూ..........."
డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మకు హారర్ సినిమాలంటే మోజు మరీ పెరిగినట్లు కనబడుతోంది. ఏప్రిల్ 16న "ఆవాహం" పేరుతో వస్తున్న దెయ్యం చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఏకంగా దెయ్యాల్ని 3డీలో చూపిస్తానని చెపుతున్నారు.అదేమని అడిగితే... దెయ్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికి ఉండదూ..? అని ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు చిన్నప్పుడు నేను దెయ్యం అని అందర్నీ భయపెట్టేవాడనని చెపుతున్నారు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తమ ఇంట్లోని తలుపు వెనక నిలబడి ఇంట్లోకి వచ్చేవారిని "భూ..." అని భయపెట్టేవాడినని తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందుకే అసలు దెయ్యమంటే ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాననీ, అది కూడా 3డీలో మరీ దగ్గరగా చూపించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
నిజానికి టెక్నికల్‌గా దెయ్యం సినిమాలను ఇలా తీస్తేనే ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు. థియేటర్లలో చూస్తే ఎవరో ఒకరు చేస్తున్న ఫీలింగ్ ఉంటుందనీ, అదే 3డీలో అయితే దెయ్యం మన వద్దే ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెపుతున్నారు. ఆ అనుభవాన్ని ప్రేక్షకులకు కలిగించేందుకు ఈ 3డీ సినిమా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు వర్మ.