Avaham | Ram Gopal Varma | Milind | Phoonk - 2 | "ఆవహం" చూసే దమ్ముందా...? ఐతే రూ. 5 లక్షలు మీవే
IFM
ఇప్పటికే దేశంలో ఆరు లక్షలమంది ఎంట్రీలు పంపారనీ, అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షా 8వేల మంది ఉన్నారన్నారు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే పాల్గొనడం విశేషమన్నారు. తమ డాక్టర్ల పర్యవేక్షణలో వీరి ఆరోగ్య కండిషన్స్ పరీక్షించి డ్రా ప్రకారం కొందరిని ఎంపిక చేస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రశాంత్ బుర్ర తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 1200 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా మార్కెట్ స్ట్రాటజీ మాత్రమేనన్నారు.
చిత్ర దర్శకుడు మిలింద్ మాట్లాడుతూ... హాయిగా ఉన్న ఓ కుటుంబంలో చేతబడి వల్ల ఆ ఇంట్లోని పాపకు దెయ్యం పడుతుంది. చేతబడి చేసిన వారిని తాంత్రికుని సాయంతో శిక్షిస్తారు. ఇది పూంఖ్-1గా నేను రాసిన కథ. ఇప్పుడు దర్శకుడిగా మారి దానికి కొనసాగింపుగా చిత్రాన్ని తీశాను. ఇందులో చేతబడి చేసిన ఆమె దెయ్యంగా మారి ఆ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు నానా రకాలుగా భయపెట్టి హింసిస్తుంది. అది ఎలా అనేది సినిమా.
తెలుగులో ఈ సినిమాకు "ఆవహం" అనే పేరు పెట్టాం. హార్రర్ మూవీస్‌కి రీరికార్డింగ్‌తోపాటు టెక్నికల్ వాల్యూస్ కూడా ప్రాధాన్యం. ముఖ్యంగా నిశ్శబ్ధం, శబ్ధం ఎలా ఉంటాయో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాం. ఇటువంటి కథ రాయడానికి ప్రేరణగా తెలుగులో తులసిదళం చెప్పుకోవచ్చు. ఇది సినిమా వరకే. నిజజీవితంలో దెయ్యాల్ని నేను నమ్మను అన్నారు.
బాలనటి అష్‌సాస్ మాట్లాడుతూ... 6వ తరగతి చదువుతున్న తాను పలు హిందీ చిత్రాల్లో నటించాననీ, వర్మ చిత్రంలో నటించడం థ్రిల్‌గా ఉందని చెప్పింది. షూటింగ్ సమయంలో తానేమీ భయపడలేదని అంది. తన తండ్రి పంజాబీ దర్శకుడనీ, తల్లి నటి అని చెప్పింది. ఈ చిత్రంలో తనను దర్శకుడు చక్కగా నటింపజేసేలా తీర్చిదిద్దారనీ, తన పాత్రకు అవార్డు వస్తుందని భావిస్తున్నానని తెలిపింది.