Allari Naresh | Vamsi | Saradaga Kaasepu | అల్లరి నరేష్ హీరోగా వంశీ "సరదాగా కాసేపు"
వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం మొదలైంది. "సరదాగా కాసేపు..." పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ సరసన మధురిమ నాయికగా చేస్తున్నారు. అష్టాచమ్మా ఫేమ్ అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.
చిత్ర విశేషాలను నిర్మాత వివరిస్తూ.. ఈ నెల 9న పూజా కార్యక్రమాలతో నిరాడంబరంగా చిత్రీకరణ మొదలైంది. 19 నుంచి రాజమండ్రిలో భారీ షెడ్యూల్ చేయబోతున్నాం. 20 రోజులు జరిపే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతోపాటు, రెండున్నర పాటలను చిత్రీకరిస్తాం అన్నారు.
చిత్ర సమర్పకులు రవి సదాశివుని మాట్లాడుతూ... వంశీ శైలిలో సాగే పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా అంతా సరదాగా ఉంటుంది. చక్రి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయన్నారు.
ఆహుతి ప్రసాద్, జయలలిత, జీవా, సన, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, సుభాష్, రమ్యశ్రీ, దువ్వాసి మోహన్, కృష్ణేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శంకరమంచి, మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం, సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్