1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. YSR

Young India | YSR | Dasari Narayana Rao | "యంగ్ ఇండియా" వైఎస్సార్‌కు అంకితం: దాసరి

యంగ్ ఇండియా
FILE
శతచిత్ర దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ నిర్మించిన "యంగ్ ఇండియా" ఆడియో ఆవిష్కరణోత్సవ సంబరం ఏప్రిల్ 10న రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 81మంది అచ్చ తెలుగు నటీనటులను పరిచయం చేస్తూ డాక్టర్ దాసరి నారాయణరావు తీర్చిదిద్దుతున్న ఈ క్రేజీ చిత్రాన్ని ఆయన శ్రీమతి దాసరి పద్మ సమర్పిస్తుండగా కె. రామకృష్ణ ప్రసాద్ సిరి మీడియా పతాకంపై అందిస్తున్నారు.

ఉన్నత ఆశయాలతో నిర్మించిన ఈ చిత్రాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితమిస్తున్నట్లు దాసరి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాకు మిత్రుడు, మనకు నాయకుడు, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారి ఆశయాలకు అనుగుణంగా ఈ చిత్ర కథాక్రమంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందుకుగాను ఆయన ఆత్మకు సంతృప్తి కలుగుతుందన్న భావంతో యంగ్ ఇండియా చిత్రాన్ని వైఎస్సార్‌కు అంకితమిస్తున్నట్లు పత్రికాముఖంగా తెలియజేశారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT