1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Naga Chaitanya

E maya chesave | Naga Chaitanya | Samantha | A.R. Rahman | Super Star Krishna | శతదినోత్సవానికి చేరువలో "ఏ మాయ చేసావె"

ఏ మాయ చేసావె
WD
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో సంజయ్ స్వరూప్ నిర్మించిన ప్రేమకథా చిత్రం "ఏ మాయ చేసావె". ఈ సినిమా విడుదలై 102 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.

ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. "గౌతమ్ డైరక్షన్‌లో, రెహమాన్‌గారి మ్యూజిక్‌తో నా రెండో చిత్రం చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించిన మంజుల, సంజయ్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి నన్ను మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి ప్రోత్సహించిన ప్రేక్షకులకు, అక్కినేని వంశాభిమానులకు అందరికీ కృతజ్ఞతలు" అని అన్నారు.

నిర్మాత సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ.. " ఓ మంచి ప్రేమకథా చిత్రంగా "ఏ మాయ చేసావె" చిత్రాన్ని అపూర్వంగా ఆదరించి సూపర్‌హిట్ చేసిన ప్రేక్షకులకు, అక్కినేని వంశాభిమానులకు కృతజ్ఞతలు చేస్తున్నాను. నాగచైతన్యకు "ఏ మాయ చేసావె" సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే హీరోయిన్ సమంతాకు ఈ చిత్ర విజయం మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది. చాలా సెంటర్స్‌లో స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో శతదినోత్సవానికి పరుగులు తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.
About Writer
SELVI.M