1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Sidharth

Bava film | Sidharth | Rajendra Prasad | 19 నుంచి "బావ" మూడో షెడ్యూల్

బావ
సిద్దార్థ్ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ప్రణీత కథానాయిక. శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈనెల 19 నుంచి 14 రోజులపాటు హైదరాబాదులో జరుగనుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎల్.పద్మ కుమార్ చౌదరి మాట్లాడుతూ... తొలి షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో చేశాం. రెండో షెడ్యూలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పరిసరాల్లో చేశాం. గోదావరి తీరాన పెదపట్నం లంకలో వేసిన సెట్‌లో సిద్ధార్థ్, ప్రణీతలపై లవ్ సీన్స్ తీశాం.

జిన్నూరు, వేడంగి, పాలకొల్లు పరిసరాల్లో సిద్ధార్థ్ అతని స్నేహ బృందంపై ఎంటర్‌టైన్మెంట్ సీన్స్ తీశాం. ఇందులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సిద్ధార్థ్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. మూడో షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం అని తెలిపారు.

దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... అందమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్‌స్టోరీ ఇది. అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం, చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ఒక్కో దృశ్యం ఒక్కో పెయింటింగ్‌లా ఉంటుంది. చక్రి అద్భుతంగా పాటలు చేశారు. ఇందులో రెండు పాటలకు ప్రభుదేవా నృత్య దర్శకత్వం చేయబోతున్నారు.. అని చెప్పారు.

బ్రహ్మానందం, పవిత్రా లోకేశ్, రఘుబాబు, నాజర్, ఆహుతి ప్రసాద్, జోగి నాయుడు, వేణు, సురేఖావాణి, వినయ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణ రెడ్డి, సమర్పణ: సందీప్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT