1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. R. Narayana Murthy

Veera Telangana | R. Narayana Murthy | August 15 | September | తెలంగాణ ఉద్యమానికి అద్దం పట్టే "వీర తెలంగాణ"

వీర తెలంగాణ
WD
స్నేహ చిత్ర పతాకంపై 22వ చిత్రంగా ఆర్. నారాయణమూర్తి "వీర తెలంగాణ" చిత్రాన్ని నిర్మించారు. భూమికోసం, భుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తికోసం సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన నాలుగువేల మంది అమరవీరులకు ఈ చిత్రం అకింతమని ప్రకటించారు.

ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "వీర తెలంగాణా సినిమా తీసినందున నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. నైజాం నవాబులు, దొరలు ప్రజల్ని ఏవిధంగా పీడించి శాసించారో రజకార్ల ఉద్యమనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు తీశారు.

తెలంగాణాకు స్వాతంత్ర్యం రెండుసార్లు వచ్చింది. అందరికీ ఆగస్టు 15 అయితే, మళ్ళీ సెప్టెంబర్ 17న మరోసారి వచ్చింది. వీటినన్నింటినీ విశ్లేషిస్తూ ఆనాటి పోరాటయోధులను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తీశాను. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.
About Writer
SELVI.M