Takita Takita | Bhumika Chawla | Nagarjuna | Arundhati | Anushka | హిమాలయాల్లో "తకిట తకిట" షూటింగ్!
WD
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీహరి నాను మాట్లాడుతూ.. "పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఒక పాట, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందుతోంది. భూమిక, భరత్‌ఠాకూర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా చాలా మంది కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. "తకిట తకిట" తెలుగులో ఓ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టబోతోంది" అని అన్నారు.
ఇకపోతే.. ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, మాటలు : బి.వి.ఎస్. రవి, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, కెమెరా: కె.కె. సెంథిల్ కుమార్, సంగీతం: బోబో శశి, సమర్పణ: భూమిక చావ్లా, నిర్మాత: భరత్ ఠాకూర్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీహరి నాను.