Aunty uncle nandagopal | Vadde Naveen | Sadhika | మే మొదటివారంలో "ఆంటీ అంకుల్ నందగోపాల్"
వడ్డే నవీన్ హీరోగా యం.విజయకుమారి సమర్పణలో జయకృష్ణా క్రియేషన్స్ పతాకంపై డి.వి.కె.నాగేశ్వరరావు దర్శకత్వంలో సి.గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ "ఆంటీ అంకుల్ నందగోపాల్". షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత సి.గోపాలకృష్ణ మాట్లాడుతూ... కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్యభరిత చిత్రంగా మా ఆంటీ అంకుల్ నందగోపాల్ రూపొందుతోంది. చక్కని కథ, కథనాలతో అందరినీ ఆకట్టుకునే ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటులంతా నటించారు. ఆంటీ అంకుల్ నందగోపాల్ అనే టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
వడ్డే నవీన్, లక్షణ, సాధిక, కోట, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, తనికెళ్ల భరణి, ధర్మవరపు, ఝాన్సీ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, నిర్మాత: సి.గోపాలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డి.వి.కె నాగేశ్వరరావు
