1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rajasekar

Maa Annayya Bangaram | Rajasekar | Kamalini Mukherjee | Switzerland | Shooting | సిట్జర్లాండ్‌లో "మా అన్నయ్య బంగారం" షూటింగ్

మా అన్నయ్య బంగారం
FILE
డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ నాయకానాయికలుగా జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మిస్తున్న "మా అన్నయ్య బంగారం" చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఎల్.జె. స్టూడియోలో ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటల రికార్డింగ్ జరుగుతోందని నిర్మాత తెలిపారు. ఈ పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారని ఆయన చెప్పారు.

ఇంకా ఈ నెల 22 నుంచి 30 వరకు సిట్జర్లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించనున్నామని నిర్మాత వెల్లడించారు. మే 3 నుంచి జూలై ఐదో తేదీ వరకు సింగిల్ షెడ్యూల్‌తో ఏకధాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని నట్టికుమార్ చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా ఆదిత్య ఓం, రోహిత్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, అలీ, ఝాన్సీ, సన, శివపార్వతి, జయలలిత, చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కథ : భూపతిరాజా, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : చంద్రబోస్, సంగీతం : ఎస్.ఎ. రాజ్‌కుమార్, ఛాయాగ్రహణం : డి.ప్రసాద్ బాబు, ఆర్ట్ : కె.వి. రమణ, ఎడిటింగ్ : గౌతంరాజు, ఫైట్స్ : విజయ్, కో-డైరక్టర్ : రవి, ప్రొడక్షన్ ఎగ్టిక్యూటివ్స్ : ఎ. కోటిలింగం, బి. ముత్యాలరాము, నిర్మాణ సారథ్యం : కుమారి నట్టి లక్ష్మీకరుణ, సమర్పణ : మాస్టర్ నట్టి క్రాంతి, నిర్మాత : నట్టికుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : జొన్నలగడ్డ శ్రీను.
About Writer
SELVI.M