1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rajendra Prasad

Thrilling | Rajendra Prasad | HeRaj | Raja sridhar | Vahida | Uttej | రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో "థ్రిల్లింగ్" మూవీ!

థ్రిల్లింగ్
WD
ఆర్.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై "థ్రిల్లింగ్" అనే చిత్రం ప్రారంభమైంది. గతంలో పలు చిత్రాలకు కథానాయకుడిగా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మున్నావర్ అలీ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో హేరాజ్ హీరోగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో అనుభవావాలను నేర్చుకున్నాను. నటునిగా పలు చిత్రాలు చేశాను. దర్శకుడిగా మారుతానని అనుకోలేదు. ఈ చిత్రం అందరూ మెచ్చే చిత్రమవుతుందనే నమ్మకముంది. థ్రిల్లర్ అయినా లవ్‌స్టోరి కూడా ఇందులో ఉంది. ప్రముఖ హీరో ఇందులో నటిస్తున్నారు. కథ చెప్పగానే వెంటనే నటించేందుకు అంగీకరించారు. ఆ పాత్ర సస్పెన్స్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది" అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ.. చక్కటి సాంకేతిక సిబ్బంది, నటీనటులతో థ్రిల్లర్ సినిమాను నిర్మిస్తున్నానని చెప్పారు.

హీరో హేరాజ్, మరో హీరో రాజా శ్రీధర్, వహీదా, ఉత్తేజ్‌లపై ముహూర్తపు షాట్ తీశారు. దీనికి చలపతిరావు క్లాప్ కొట్టగా, నిర్మాత, శ్రేయోభిలాషి బి.వి. రమణ స్విచ్ఛాన్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో ఆహుతిప్రసాద్, దర్శకుడు శరత్, కవిత, సన తదితరులు నటిస్తున్నారు. కెమెరా : రామ్‌కుమార్, ఎడిటింగ్ : వేణుపెద్దు.
About Writer
SELVI.M