Prabhas | Kajal Agarwal | Darling | Magadheera | Shooting | Toliprema | ప్రభాస్ "డార్లింగ్"కు క్లీన్ "యు" సర్టిఫికేట్: 23న విడుదల
WD
ఈ సందర్భంగా నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల సెన్సార్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ "యు" సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫీల్‌గుడ్ మూవీగా అందరి ప్రశంసలు పొందుతుంది. ఇది లవ్‌స్టోరీ అయినప్పటికీ యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ కెరీర్‌లోనే "డార్లింగ్" బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "డార్లింగ్" చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, ఆహుతి ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు : స్వామి, సంగీతం : జి.వి.ప్రకాష్, ఫోటోగ్రఫీ : ఆండ్రూ, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : అశోక్, డాన్స్ : కళ్యాణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు : అనంత శ్రీరామ్, నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : కరుణాకరన్.