1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Hindi

Prasthanam | Hindi | Sarvanand | Deva Katta | Remake | Teja | హిందీలో రీమేక్ కానున్న శర్వానంద్ "ప్రస్థానం"!

ప్రస్థానం
FILE
శర్వానంద్ దర్శకత్వంలో దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన "ప్రస్థానం" చిత్రానికి సక్సెస్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రీమేక్ చేయడానికి హక్కులు అడిగారని, అలాగే తమిళంలో కూడా రీమేక్ చేయమని ఆఫర్లు వచ్చాయని చిత్ర దర్శకుడు దేవకట్టా మంగళవారం తెలియజేశారు.

ఇంకా దేవకట్టా మాట్లాడుతూ.. "శర్వానంద్ హీరోగా నటించిన "ప్రస్థానం" సినిమాకు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. దర్శకుడు తేజ సినిమా చూసి ఫోన్‌చేసి.. నేను ఈ సినిమా చూశాక.. హాంగోవర్‌లోకి వెళ్ళాను. వెంటనే ఫోన్ చేయాలంటే మాటరాలేదు. చాలా అద్భుతం తీశావ్. హిందీలో నాకు తెలిసిన వ్యక్తి రైట్స్ అడుగుతున్నాడు. ఇస్తావా? అని అడిగితే నేనే ఆశ్చర్యపోయాను. వెన్నెల తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని మంచి చిత్రాన్ని తీయాలనే ఉద్దేశంతో "ప్రస్థానం"ను రూపొందించాను." అని అన్నారు.

ఇక సాయికుమార్ తన పాత్ర గురించి చెబుతూ.. "చాలా మంది ఫోన్లు చేసి బ్రహ్మాండంగా చేశారన్నారు. ఆతృతతో నేను బెంగళూరునుంచి హైదరాబాద్ వచ్చాను. నా పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎంతో రెస్పాన్స్ వచ్చింది. వాయిస్‌తో పాటు హావభావాలు గల ముసలి పాత్రను దేశంలో ఎవ్వరూ చేయరని నాకు మెసేజ్‌లు వచ్చాయి. ఈ ఉత్సాహంతో హైదరాబాద్ వచ్చేశాను. ప్రస్తుతం కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్నాను. ఇకపై తెలుగు చిత్రాల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. గాడ్‌ఫాదర్ నుంచి ఎన్నో చిత్రాలు రాజకీయ నేపథ్యంలో వచ్చాయి. కానీ ప్రస్థానం మాత్రం దేవకట్టా బ్రెయిన్‌లోంచి వచ్చింది. ఇందులో ప్రతీదీ జీవంగల పాత్ర." అని చెప్పారు.

దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ.. "మంచి సినిమాలు చేయాలనే కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరింది. కథ చాలా బలంగా ఉంది. పాత్రలు మరింత బలంగా ఉన్నాయి. చాలామంది పాటలు చిత్రానికి అడ్డంకిగా ఉన్నాయని చెప్పారు. అందుకే తీసేశాం. కామెడీ ఆర్టిస్టులు లేకుండా సీరియస్‌గా సాగే.. "ప్రస్థానం" అన్ని వర్గాల ప్రేక్షకుల అలరించే చిత్రమైంది." అని తెలిపారు.

నటుడు సందీప్ మాట్లాడుతూ.. "నెగటివ్‌షేడ్స్ ఉన్న పాత్రను చిత్రరంగంలో పరిచయం అవడంలోనే రావడం చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇంతకంటే ఆర్టిస్టుగా కావాల్సింది ఏముంది..? ప్రస్థానంలో నటించడం గర్వంగా ఉంది" అని చెప్పారు.
About Writer
SELVI.M