1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Gopal Varma

Gayam-2 | Ram Gopal Varma | Jagapathi Babu | Vimala Raman | Ilaya Raja | రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో జగపతిబాబు "గాయం-2"

గాయం2
జగపతిబాబు, విమలారామన్ కాంబినేషన్‌లో ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో కర్త క్రియేషన్స్ పతాకంపై డా. ధర్మకర్త.సి నిర్మిస్తున్న చిత్రం "గాయం-2". ఈ చిత్రానికి ప్రముఖ దర్శక-నిర్మాత రామ్ గోపాల్‌వర్మ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ శ్రీ మాట్లాడుతూ.. "జగపతిబాబు సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన "గాయం" చిత్రానికి పర్‌ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇండియాలో ఈ తరహా సీక్వెల్ ఎవరూ చేయలేదు. మా గురువు రామ్‌గోపాల్‌వర్మ చిత్రానికి నేను సీక్వెల్ చేయడం, ఆ సీక్వెల్‌కు ఆయన సమర్పకునిగా వ్యవహరించడం నా అదృష్టం" అని చెప్పారు.

నిర్మాత డా. ధర్మకర్త.సి మాట్లాడుతూ.. " ఓ కొత్త స్టయిల్‌లో ఉండే యాక్షన్ చిత్రమిది. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడైన ప్రవీణ్ శ్రీ ఈ చిత్రాన్ని ఇన్నోవేటివ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో రామ్‌గోపాల్ వర్మ, జగపతిబాబు ఇస్తున్న సహకారాన్ని మరిచిపోలేను. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో మొత్తం ఐదు పాటలుంటాయి. భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, వనమాలి, కలువ కృష్ణసాయి ఈ పాటలు రాశారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. మా కోరిక మేరకు ఇందులో ఒక పాటను ఇళయరాజా పాడడం విశేషం" అని తెలిపారు.

లైన్ ప్రొడ్యూసర్ భరత్.సి మాట్లాడుతూ.. "ఇటీవలే బ్యాంకాక్‌లో 20 రోజులు షెడ్యూల్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు జగపతిబాబు, విమరామన్‌లపై రెండు పాటలు చిత్రీకరించాం. జగపతిబాబు, విమలారామన్, కోట ప్రసాద్, తనికెళ్ల భరణి, జీవా, హర్షవర్ధన్, మాస్టర్ పవన్ శ్రీరామ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మే 3 నుంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ చేయబోతున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు : గంధం నాగరాజు, కెమెరా : అనిల్ భండారి, ఎడిటింగ్ : ప్రవీణ్, స్క్రీన్‌ప్లే : రాజేంద్రరెడ్డి, ఆర్ట్ : ధర్మేంద్ర.
About Writer
SELVI.M