Em Pillo Em Pillado | Actress Pranita | Pokuri Babu rao | పైసా పుచ్చుకోని "ఏం పిల్లో... ఏం పిల్లడో" హీరోయిన్
ఈమధ్య హీరోయిన్లకోసం దర్శకులు ఇతర రాష్ట్రాలలో వేట సాగించడం తెలిసిందే. తాజాగా పోకూరి బాబూరావు నిర్మిస్తున్న "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్ర హీరోయిన్ ప్రణీతను ఢిల్లీ నుంచి తీసుకువచ్చారు. ఈమె అచ్చు నయనతారలా ఉంటుందని అందరూ అంటున్నారు.
అయితే చిత్రం రన్నింగ్‌లో ఉండగానే ఆమెకు పలు ఆఫర్లు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన రెమ్యునరేషన్ బాబూరావుగారు చూసుకుంటారని మరీ చెపుతోందట. దీంతో ఆమె పారితోషికం ఎంతనే విషయాన్ని పోకూరి బాబూరావు డిసైడ్ చేస్తున్నాడట.
తన సినిమాకు ఆమెకు డబ్బులు ఇంకా ఇవ్వలేదని చెపుతున్న పోకూరి బాబూరావు ఆమె డేట్స్‌ను చూసే వ్యక్తిగా మారిపోయాడు. గతంలో ఇలియానాకు దేవదాసు దర్శకుడు చౌదరి కూడా ఇలాగే చేశాడు. సినిమా ఛాన్సులిస్తూ వారితో బిజినెస్ చేయడమంటే ఇదేనని పలువురు అంటున్నారు.
