1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Krishnudu

Pappu | Krishnudu | Deepika | మే నెలాఖరుకి "పప్పు - మిస్టర్ ఇంటెలిజెంట్"

పప్పు
WD
కృష్ణుడు, దీపిక, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో ఆర్సీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత నల్ల ప్రవీణ్ రెడ్డి, నగేష్ యాదవ్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పప్పు- మిస్టర్ ఇంటెలిజెంట్. అష్టా - చమ్మా చిత్రంతో దర్శకత్వ శాఖలో చక్కని అనుభవం పొంది పప్పు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు యంగ్ డైరెక్టర్ సపన్ పసుపర్తి.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన నల్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమకు కొత్తవారైనప్పటికీ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. దర్శకుడు సపన్ ఆలోచనలకు తగ్గట్లు కథను అద్భుతంగా ఆవిష్కరించాం. రామోజీ ఫిలిమ్ సిటీ, వైజాగ్, అరకు, వికారాబాద్ ఫారెస్టు, హైదరాబాదులోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం.

డైలాగ్స్‌తోపాటు అమ్మరాజశేఖర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. కృష్ణ చైతన్య సాహిత్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ శిష్యుడు ఫణి కల్యాణ్ అందించిన బ్యూటిఫుల్ ట్యూన్స్ చాలా బాగా కుదిరాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మే రెండో వారంలో చిత్రం ఆడియోను, నెలాఖరుకి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.

ఈ చిత్రానికి ప్రాజెక్టు కో- ఆర్డినేటర్: సంతోష్ కుమార్, సహనిర్మాతలు: సంపూర్ణ, దినేష్ తులసి, నిర్మాతలు: నల్ల ప్రవీణ్ రెడ్డి, నగేష్ యాదవ్, కథ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: సపన్ పసుపర్తి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT