1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Second Schedule

Galli kurrollu | Second Schedule | Tejam | సందేశాత్మక చిత్రంగా "గల్లీ కుర్రాళ్లు"

గల్లీ కుర్రాళ్లు
అంతా కొత్తవారితో "గల్లీ కుర్రాళ్లు" (దేశానికి వెన్నెముకలు) చిత్రం రూపొందుతోంది. స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై సాయివెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా నిర్మాత సాయివెంకట్ మాట్లాడుతూ.. "జనవరి 27 నుంచి సినిమాను ప్రారంభించాం. ఇప్పటికే పూర్తయిన రెండు షెడ్యూళ్లలో రెండు పాటలను చిత్రీకరించాం. దీంతో 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. 24 నుంచి మూడో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నాం. ఈ చిత్రంలో కవిత పాత్ర కీలకం. ఆమె ఒక అనాధకుర్రాడిని పెంచుకుని సైంటిస్టుగా తీర్చిదిద్దుతుంది. ముప్పైశాతం పిల్లలపై తీసిన ఈ చిత్రాన్ని వాణిజ్యాంశాలతో తీర్చిదిద్దుతున్నాం. ఇంకా ఈ సినిమాలో బ్రహ్మానందం సందేశం ఇచ్చే సన్నివేశంలో కన్పిస్తారు. భారత సంస్కృతి సంప్రదాయాలపై వేటూరి రాసిన గీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో "తేజం" ఫేమ్ సర్దార్ పటేల్ నెగటివ్ పాత్ర పోషిస్తున్నారు" అని తెలిపారు.

కవిత మాట్లాడుతూ.. అవార్డు కోసం తీస్తున్న ఈ చిత్రంలో తాను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సైంటిస్ట్‌గా తాను నటిస్తున్నానని నాగవర్మ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో షఫాలి శర్మ, స్వాతి, కీర్తిచంద్ర, వివేక్ బాబు, చంద్రమోహన్, లక్ష్మీకాంతం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కథ: సరిత, మురళి, కెమెరా: నాగేంద్రకుమార్. నిర్మాత, దర్శకత్వం: సాయి వెంకట్.