1977 | Sarath Kumar | Namitha | Jayasudha | అర్థశతదినోత్సవానికి చేరువలో శరత్, నమితల "1977"
తమిళ దర్శక నిర్మాత దినేష్ కుమార్ నిర్మించిన "1977" జరిగింది ఏమిటి? చిత్రం ఇటీవలే తెలుగులో విడుదలైంది. పక్కా మసాలా చిత్రమిది. శరత్‌కుమార్, నమిత తదితరులు నటించిన ఈ చిత్రం 70 సెంటర్లలో విడుదలైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు దినేష్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగులో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఎంతో ఆనందంగా ఉంది. 70 సెంటర్లలలో 50 రోజుల వైపు పరుగులు తీస్తోంది. తెలుగులో ఈ చిత్రం విడుదలకావడానికి సహకరించిన మధుర ఆడియో అధినేత శ్రీధర్, విఎన్ఆర్ ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో త్వరలో తెలుగులో చిత్రాన్ని తీస్తాను. ఈ చిత్రానికి తన భార్య మణిమౌళి కాస్ట్యూమ్స్ అందించారు" అని అన్నారు.
నటుడు రాజ్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడి కంటే నటునిగా పనిచేయడం చాలా కష్టం. ఈ చిత్రంలో విలన్‌గా నటించి ప్రశంసలు పొందాను. ఈ సక్సెస్‌కు కారణం ప్రేక్షకులే.." అని చెప్పారు. జయసుధ మాట్లాడుతూ.. " నేను చాలా కాలం తర్వాత ఈ సినిమాలో తల్లి పాత్రను పోషించాను. శరత్‌కుమార్‌కు భార్యగా, తల్లిగా నటించాను. మంచి పాత్ర చేశాను" అని సంతృప్తినిచ్చిందన్నారు.
