Brahma Lokam to yamalokam | Rajendra prasad | Aarthi Agarwal | venu Madhav | రీరికార్డింగ్‌లో "బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం)"
WD
ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ.. "సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు జెమినీ గ్రాఫిక్స్ బాల గ్రాఫిక్ వర్క్ చేస్తున్నారు. సోమవారం నుంచి రీరికార్డింగ్ శ్రీలేఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. మామూలు చిత్రాలకంటే సోషియోఫాంటసీ చిత్రాలకు తగినట్లుగా ఆమె రీరికార్డింగ్ ఇవ్వగలదని ఆశిస్తున్నాం. మే నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం" అని తెలిపారు.
శ్రీ లేఖ మాట్లాడుతూ.. "టైటిల్ చాలా ఫన్నీ ఉంది. సోషియో ఫాంటసీ చిత్రాలకు బాణీలు సమకూర్చడం కష్టమైన పనే. అయినా ఇష్టంగా చేస్తున్నా. బ్రహ్మ, యముడులపై వచ్చే పాటకు బాణీలను కీరవాణి స్పూర్తిగా తీసుకుని చేశాను. ఇది పూర్తి వినోదాత్మక చిత్రం" అని అన్నారు.
చిత్ర దర్శకుడు గొల్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "అఆఇఈ" చిత్రానికి కథ అందించాను. ఈ చిత్రంతో దర్శకుడిగా మారాను. వేదాంతంతో కూడిన కామెడీ ఈ స్క్రిప్ట్ ప్రత్యేకత. రాజేంద్రప్రసాద్, శివాజీ నటించిన ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది" అని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇంకా ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, సోనియా, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డి, ఏవీఎస్, ఎం.ఎస్. నారాయణ, కొండవలస తదితరులు నటించారు. కెమెరా: వాసు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటర్: వి. నాగిరెడ్డి.