Actor | Cinema Industry | Tollywood | Brahmanandam | బ్రహ్మానందానికి రోజుకు రూ.4 లక్షలు.. మా వల్లకాదు బాబోయ్!!
WD
దీంతో అంతకుముందున్న పలు సమస్యలతోపాటు ఈ సమస్యపై కూడా నిర్మాతల మండలి దృష్టిపెట్టింది. ముగ్గురు.. నలుగురు పెద్ద నిర్మాతలు కూడా హీరోల పారితోషికం కూడా తగ్గించుకోవాలనీ, నిర్మాణవ్యయం పెరిగిపోకుండా చూడాలని సూచించారు. ఏదో సామెత చెప్పినట్లు... దొంగల వద్దకు వచ్చి మా ఇంట్లో దొంగలు పడుతున్నారు.. చూడండి అన్నట్లుగా... ఉంది చిన్న నిర్మాతల పరిస్థితి అని కొందరు గొణుక్కోవడం కనిపించింది.
అసలు సంగతి ఏంటంటే... ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో పెద్దలంతా అగ్రనిర్మాతలే. వారి వంశీయులే హీరోలుగా చేస్తున్నారు. కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా వారే ముందుంటారు. అటువంటి వారు నిర్మాణవ్యయం గురించి, హాస్యనటుల గురించి విపులంగా చర్చించి.. హాస్యనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయం చేశారు. ఈ మేరకు అందరూ ఆర్టిస్టులకు ఉత్తరాలు సైతం పంపారు. అవి కొంతమందికి చేరాయి. మరికొంతమందికి చేరాల్సి ఉంది.
అయితే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్నా కథానాయకుల గురించి చర్చించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం మళ్లీ వాయిదా వేసినట్లు సమాచారం. ఏదేమైనా ఇచ్చేవాడు ఉంటే తీసుకోవడానికి మాకేమీ అభ్యంతరం... ఏదైనా ఇవ్వలేనని.. ముందుగా మాకు చెబితే మేమే సరిచేసుకుంటాం గదా అని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రముఖ హీరో వ్యాఖ్యానించారు. దాంతో హీరోలతో పనికాదనుకుని.. హీరోయిన్లపై నిర్మాతల మండలి దృష్టి పెట్టింది. హీరోయిన్లు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఓ సర్క్యలర్ కూడా పంపారు. మరి హీరోల మాటేమిటో తేలాల్సి ఉంది.