Pappu | Mr. Intelligent | Krishnudu | Deepika | Ashta Chemma | రీ-రికార్డింగ్‌లో కృష్ణుడి "పప్పు" (మిస్టర్ ఇంటలిజెంట్)
WD
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నల్లప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. "పవన్ ఆలోచనలకు తగినట్లుగా కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీ, వైజాగ్, అరకు, వికారాబాద్ ఫారెస్ట్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశాం. డైలాగ్స్‌తో పాటు అమ్మ రాజశేఖర్ డాన్స్ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. కృష్ణ చైతన్య సాహిత్యానికి రెహమాన్ శిష్యుడు ఫణి కళ్యాణ్ సమకూర్చిన బాణీలు అమరాయి. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 2న ఆడియోను, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
దర్శకుడు పసుపర్తి మాట్లాడుతూ.. "వినాయకుడు, ఏమాయ చేసావె చిత్రాల తర్వాత కృష్ణుడు కెరీర్‌లో మరో చక్కటి చిత్రంగా "పప్పు" నిలుస్తుంది. లీడర్ తర్వాత సుబ్బరాజు నటుడిగా సవాల్‌తో కూడిన పాత్రను పోషించారు. కామెడీ, స్నేహం విలువతో ఈ చిత్రాన్ని రూపొందించాం. కృష్ణుని పాత్రపరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించే చిత్రమవుతుంది. వ్యాపారపరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం నిర్మాతలకు మంచిపేరు తెస్తుందనే నమ్మకముంది" అని తెలిపారు.
ఈ చిత్రానికి ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్: సంతోష్ కుమార్, సహనిర్మాతలు: సంపూర్ణ, దినేష్ తులసి, నిర్మాతలు: నల్ల ప్రవీణ్‌రెడ్డి, నగేష్ యాద, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు, దర్శకత్వం: పవన్ పసుపర్తి.