Takita Takita | Anushka | Nagarjuna | Bhumika | Bharat Tagoore | షూటింగ్‌ను పూర్తి చేసుకున్న "తకిట తకిట"
WD
నిర్మాత, భూమిక భర్త భరత్ ఠాగూర్ మాట్లాడుతూ.. "విభిన్నమైన సంస్కృతులుగల ఎనిమిది మంది స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ. వారిలో నెలకొన్న అపోహలు కొన్ని తాత్కాలిక సంఘటనలు ఎలా జీవితాల్ని మార్చివేశాయనేది చక్కగా చూపించారు. కథ ప్రకారం కొత్త వారిని ఎంపికచేశారు. వారికి ఆరు నెలల పాటు నటనలో శిక్షణ ఇచ్చాం. అక్కినేని నాగార్జున, అనుష్క, భూమిక ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. భూమిక ఇంగ్లీషు లెక్చరర్‌గా నటిస్తోంది" అని అన్నారు.
దర్శకుడు శ్రీహరి నాను మాట్లాడుతూ.."సత్యభామ" చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశాను. అప్పుడే ఈ కథను రాసుకున్నాను. చాలామందికి ఈ కథ చెప్పాను. అంతా బాగుంది అన్నారు కానీ ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. అయితే ఠాగూర్ ముందుకు వచ్చారు. ఇదే ఏదో సినిమా తీయాలనికాదు. ఓ పవర్ కోసం తీస్తున్న మూవీ" అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. "షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుపుకుంటోంది. మే మొదటివారంలో ఆడియోను, చివరి వారంలో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం" అని చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, రచన : కోన వెంకట్, మాటలు: బివిఎస్ రవి, సంగీతం: బోబో శశి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీహరి నాను.