Anushka, Panchakshari | Nagarjuna | Mohan babu | Naga Chaitanya | Samudra | "పంచాక్షరి" పాటల విడుదల
అనుష్క ప్రధాన పాత్రతో "పంచాక్షరి" చిత్రం రూపొందుతోంది. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో లాంఛనంగా విడుదలైంది.
ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, నాగసుశీల, సి. కళ్యాణ్, ఎం.ఎల్. కుమార్‌చౌదరి తదితరులు హాజరయ్యారు. చంద్ర నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని అతిథులంతా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వి. సముద్ర మాట్లాడుతూ.. "పంచాక్షరి" సంగీత దర్శకుడు చిన్నా. మా కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. చిన్నా చాలా చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చక్కటి కథను మధు ఇచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది" అని నమ్మకం వ్యక్తం చేశారు.
