1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Apta Rakshaka

Venkatesh | Apta Rakshaka | Anushka | Richa Gangopadye | Chandramuki Sequel | P.Vasu | విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక" షూటింగ్ ప్రారంభం!

విక్టరీ వెంకటేష్
WD
విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక" సినిమా షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. "చంద్రముఖి" దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో, బెల్లంకొండ నిర్మిస్తున్న "ఆప్త రక్షక" సినిమా షూటింగ్ బుధవారం ఉదయం ఏడు గంటలకు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

విక్టరీ వెంకటేష్‌పై తీసిన ముహూర్తపు షాట్‌కు పూరీ జగన్నాథ్ క్లాప్ కొట్టగా, రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

"చంద్రముఖి" సీక్వెల్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో అరుంధతి ఫేమ్ అనుష్క, లీడర్ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, మిగిలిన ముగ్గురు హీరోయిన్లుగా ప్రియమణి, లక్ష్మీరాయ్‌, కమలిని ముఖర్జీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మే 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న "ఆప్త రక్షక" సినిమా షూటింగ్‌లో భాగంగా.. తొలి షెడ్యూల్‌ను విజయనగరం జిల్లా, కోరా కొండ సైనిక స్కూల్ సమీపంలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతుంది. 30 లక్షల రూపాయల వ్యయంతో వేసిన ఈ భారీ సెట్‌లో ఒక నెలపాటు షూటింగ్ జరుగుతుంది.

అలాగే వెంకీ, అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ రాజస్థాన్‌లోనూ, మూడో షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జరుగనుంది. ఇంకా కన్నడ "చంద్రముఖి-2" విష్ణువర్ధన్ నటించగా, తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించడం విశేషం.

ఇకపోతే.. సాయిగణేష్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై పి. వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఆప్తరక్షక సినిమాను ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

విక్టరీ వెంకటేష్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : శ్యామ్ కె నాయుడు, సమర్పణ: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. వాసు.
About Writer
SELVI.M