1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Movie

A Intlo O roju | Movie | Raghu Babu | Crime | Suspence | Action | "ఆ ఇంట్లో ఒక రోజు ఏం జరిగింది..!?

ఆ ఇంట్లో ఒకరోజు
రఘుబాబు హీరోగా, సింగం సుధాకరరెడ్డి దర్శకత్వంలో గాయత్రి మూవీస్ రమణ గుడిపాటి సమర్పణలో బి.ఎస్. విజువల్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషలలో నిర్మాణమవుతున్న చిత్రం "ఆ ఇంట్లో ఒక రోజు". 

ఈ చిత్రం గురించి సమర్పకుడు గుడిపాటి మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు ఒక పాట మినహా చిత్రం పూర్తయింది. ఇది క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో చిత్రం విడుదల చేస్తాం" అని అన్నారు.

దర్శకుడు సింగం సుధాకర రెడ్డి మాట్లాడుతూ.. "తమిళంలో ఈ చిత్రం పేరు "అరక్కోణం" అని పెట్టాం. తమిళ వెర్షన్‌లో శ్రీమాన్ హీరోగా నటిస్తున్నారు. ప్రాచీ అధికారి హీరోయిన్‌గా నటిస్తుంది" అని చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి పాటలు: రాణీ పూలమజాదేవి, కెమెరా: శివ.
About Writer
SELVI.M