1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Trisha

Venkatesh | Trisha | Bramhanandam | Sreenu vaitla | Devi Sri Prasad | 100 Days | వైభవంగా "నమో వెంకటేశ" శతదినోత్సవ వేడుకలు

వెంకటేష్
WD
విక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ" ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 26న "నమో వెంకటేశ" శతదినోత్సవం హైదరాబాద్‌లోని జయభేరి క్లబ్‌లో యూనిట్ సభ్యుల సమక్షంలో గెట్ టు గెదర్‌లా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లా జరిగింది.

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, త్రిష, బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్ ప్రసాద్‌ మూరెళ్ళతో పాటు యూనిట్ సభ్యులందరికీ.. ముఖ్య అతిథిగా విచ్చేసిన మూవీమొఘల్ డా.రామానాయుడు శతదినోత్సవ షీల్డులను బహూకరించారు.

ఈ కార్యక్రమానికి ఝాన్సీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తొలి ప్రయత్నంగా నిర్మించిన "నమో వెంకటేశ" చిత్రానికి ఘనవిజయం చేకూర్చిన ప్రేక్షకులకు, చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించిన వెంకటేష్‌, సురేష్‌బాబులకు నిర్మాతల్లో ఒకరైన గోపిచంద్ ఆచంట ధన్యవాదాలు తెలిపారు.
About Writer
SELVI.M