Vaareva | Gautam | Brahmanandam | Shambavi | పాట చిత్రీకరణలో బ్రహ్మానందం తనయుడి "వారెవా"
ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం గౌతమ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం "వారెవా". శాంభవి కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రం.. కళ్యాణ్ మంతెన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మూవీ మిరాకిల్స్ పతాకంపై మహేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మహేశ్వరరావు మాట్లాడుతూ.. "ఈ నెల 24న చిత్రీకరణ మొదలు పెట్టాం. తొలుత హీరోహీరోయిన్లపై మాస్టర్ నిక్సన్ నేతృత్వంలో కెదార్‌నాథ్ రాసిన పాటను చిత్రీకరిస్తున్నాం. మే 3 నుంచి టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలవుతుంది. 20 రోజులు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. జూన్‌లో వైజాగ్‌లో రెండో షెడ్యూలు చేస్తాం.." అని తెలిపారు.
దర్శకుడు కళ్యాణ్ మంతెన మాట్లాడుతూ.. "యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. యువతం భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నాం. గౌతమ్ పాత్ర చిత్రణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది" అని చెప్పారు.
