1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Shooting

Nuvvakkadunte.. Nenakkadunta | Shooting | Uday Kiran | Sweta Basu prasad | షూటింగ్ ముగింపు దశలో "నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా.."

నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
ఉదయ్‌కిరణ్ సమర్పణలో ఆయనే హీరోగా నటిస్తోన్న చిత్రం "నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా..". శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని నిర్మాతలు డి. కుమార్, ఈశ్వరప్రసాద్ తెలియజేశారు.

ఇంకా చిత్రం విశేషాలను నిర్మాతలు ఫిలింఛాంబర్‌లో తెలియజేస్తూ.. "ఉదయ్‌కిరణ్ చిత్రాల్లో ఇది మంచి చిత్రమవుతుంది. లవ్‌స్టోరీ అయినా కొత్తదనంగా ఉంటుంది. మంచి ఫీల్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇందులో ఆరు పాటలున్నాయి. అవే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. మేలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

దర్శకుడు శుభ సెల్వం మాట్లాడుతూ.. "ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఉదయ్ కిరణ్ తమిళంలో కూడా నటించాడు. ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకముంది" అని తెలిపారు.

ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. "సబ్జెక్ట్, పాటలకు ప్రత్యేకత ఉన్న ఈ చిత్రానికి ప్రదీప్ కోనేరు మంచి సంగీతం అందించారు. చాలా ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని తీస్తున్నాం" అని చెప్పారు.

వేణుమాధవ్, బ్రహ్మానందం, ధర్మవరపు, నిళల్‌గల్‌రవి, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : ఎన్. రాఘవ్, మాటలు : జనార్ధన మహర్షి.
About Writer
SELVI.M