Ram Charan Teja | Kajal again | Magadheera | Dharani | "మగధీర"తో మళ్లీ జతకట్టిన పంచదార బొమ్మ!
WD
అత్యున్నత ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి దర్శకత్వాన విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ "మగధీర"లో తన అందచందాలతో పంచదార బొమ్మగా పిలువబడిన కాజల్ అగర్వాల్, తిరిగి "చిరుత"నయుడు రామ్ చరణ్ తేజతో కలిసి నటించబోతోంది.
రామ్‌చరణ్ తేజ- కాజల్ అగర్వాల్ జంటగా నటించే కొత్త సినిమాను ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మెగా సూపర్‌గుడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ఏప్రిల్ 30వతేదీ (శుక్రవారం) ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ధరణి దర్శకత్వం వహిస్తున్నారు.