Ramcharan | Kajal Agarwal | Magadheera | Merupu | Devisriprasad | ఇక నా పేరు ''రామ్‌చరణ్'' మాత్రమే: ''చిరుత''నయుడు
WD
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోన్న 'మెరుపు' చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్‌లపై తీసిన ముహూర్తపు షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ చిత్ర దర్శకుడు ధరణి మాట్లాడుతూ.. "మగధీర వంటి హిట్ తర్వాత రామ్‌చరణ్‌ను మరో కోణంలో చూపించడం చాలా కష్టమే. అందుకే సీనియర్ టెక్నీషియన్స్‌తో ముందుకు వచ్చాను. టైటిల్‌పరంగా చెప్పాలంటే.. మెరుపు లాంట కుర్రాడి కథ. మెరుపును పట్టుకోలేం. అలా కథలో రామ్‌చరణ్‌ను ఎవ్వరూ పట్టుకోలేరు. ఆయన జీవితానికి ఒక గోల్ ఉంటుంది. దానికోసం మెరుపులా ఎలా లక్ష్యాన్ని సాధించుకున్నాడనేది కథ" అని చెప్పారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ.. లవ్, యాక్షన్, కామెడీ అంశాలతో మెరుపు రూపొందుతోంది. మగధీర తర్వాత ఇంత త్వరలో కమర్షియల్ సినిమా చేస్తాననుకోలేదు. యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో తమిళ దర్శకుడు ధరణి వంట సీనియర్‌తో చేయడం ఆనందంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం బాగానే ఇస్తాడు. చిన్నతనం నుంచి కలిసి తిరిగేవాళ్ళం. కాజల్, నాది మంచి జంట అని అందరూ అంటుంటారు. మా కాంబినేషన్‌లో మరో చిత్రమిది" అన్నారు.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. "వండర్‌ఫుల్ కోస్టార్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సంగీతం దేవీశ్రీప్రసాద్ బాగానే ఇస్తాడనే నమ్మకముంది" అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు ఆర్.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్.వి. ప్రసాద్, పారస్‌జైన్‌లు కూడా మాట్లాడారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇంకా ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: పి.సి. శ్రీరామ్, ఆర్ట్: తోట తరణి.