1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Brahmaji

Abbo Vaada | Brahmaji | Rekha Sri | Rama Prabha | గ్రామీణ నేపథ్యంలో బ్రహ్మాజీ చిత్రం "అబ్బో వాడా!"

అబ్బో వాడా
పల్లెటూళ్ళలో ఉండే బంధాలు, అనుబంధాలు ఇంకా అక్కడ స్థానికంగా ఉండే రాజకీయాలు, మధ్యలో అందమైన ప్రేమకథ. వీటినన్నింటిని మిళితం చేస్తూ గ్రామీణ నేపథ్యంలో శ్రీశ్రీ కుమారస్వామి ఫిలింస్ నిర్మిస్తున్న చిత్రం "అబ్బో వాడా!". బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్. బసవపున్నయ్య నిర్మించగా, రత్నం కె.వి. దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. "హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేశారు. కొంతభాగాన్ని అడవిలో చిత్రీకరించారు. కమర్షియల్ అంశాలు జోడించి తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. మంచి క్వాలిటీ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడలేదు. కొత్తదనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది." అని అన్నారు.

బ్రహ్మాజీ, రేఖాశ్రీ, రంగనాథ్, రమాప్రభ, రామిరెడ్డి, గౌతమ్‌రాజ్, గుండు హనుమంతరావు, తిరుపతి ప్రకాష్, రాఘవ, జూ.రేలంగి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : బల్లెపల్లి మోహన్, ఛాయాగ్రహణం: కుమారస్వామి, ఎడిటింగ్: బాబు, నిర్మాత: ఎస్. బసవపున్నయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, మాటలు: రత్నం కె.వి.
About Writer
SELVI.M