Dasari Narayana Rao | Tollywood | Actors | Actresses | అంతా దిగుమతి నటీనటులే: దాసరి నారాయణరావు
WD
ఒక ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన... "మనవాళ్లకంటే మిగిలిన భాషా చిత్రాలకు సంబంధించిన హీరోహీరోయిన్లనే మనం సూపర్ హీరోహీరోయిన్లుగా చూపెడుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి తెలుగు హీరోహీరోయిన్లే కనబడకుండా పోతారు. అందుకే నా వంతుగా అంతా కొత్తవారిని, అదీ తెలుగువారిని నటీనటులుగా యంగ్ ఇండియా ద్వారా పరిచయం చేస్తున్నాను" అన్నారు.
నేటి సినిమాలను డొల్ల కథలను ఆధారంగా చేసుకుని రూపొందించటం వల్ల బాక్సాఫీసుల వద్ద బోల్తా పడుతున్నాయన్నారు. ఎక్కువగా కమర్షియల్ డెకరేషన్, యూత్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకునే విధంగా స్టోరీలకు ప్రాధాన్యతనిస్తూ జీవితాలను ఆవిష్కరించే కథలకు చోటివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తను గతంలో తీసిన ఎన్నో చిత్రాలు కేవలం కథాబలం కారణంగానే బంపర్ హిట్లు అయ్యాయని దాసరి చెప్పారు. దాసరి ఆవేదనను టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకుంటారో లేదో చూడాలి.